పైన ఫొటోలో ఇద్దరు పిల్లలున్నారు. అందులో వెనక నిల్చున్న పిల్ల.. ఫస్ట్ మూవీతో ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఈ హీరోయిన్ ఇప్పటివరకు డజను సినిమాలు చేసుంటుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ మూవీస్ చేసింది. ఫస్ట్ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి చేసిన అన్నీ సినిమాలు బిస్కెట్ అయిపోయాయి. చెప్పాలంటే ఈ బ్యూటీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రస్తుతం చేతిలో ఒక్క మూవీ మాత్రమే ఉందంటే మీరు సిట్చూయేషన్ అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా చెప్పాం కదా ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తుంటారు, పాతవాళ్లు పోతుంటారు! కానీ కొందరు మాత్రం అలా గుర్తుండిపోతారు. ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే కూడా సేమ్ అలాంటి బాపతే. ఈ ఒక్క మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఈ అమ్మాయి ఎవర్రా బాబు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు తప్పించి సినిమా హీరోయిన్ హిట్ కొట్టడమే మానేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె ‘మహారాజ’ అనే హిందీ మూవీ చేస్తూ బిజీగా ఉంది.
కెరీర్ లో ఫస్ట్ ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 118, ఇద్దరిలోకం ఒక్కటే లాంటి మవీస్ లో హీరోయిన్ గా చేసింది. ‘మహానటి’, ‘నిశ్శబ్దం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ ఎందుకో క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. హిందీలోనూ రణ్ వీర్ సింగ్ తో కలిసి సినిమా చేసిన హిట్ మాట దేవుడెరుగు.. ఛాన్సులు కరవైపోయాయి. ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. ఇది హిట్ అయితే ఓకే లేదంటే మాత్రం కెరీర్ బిస్కెట్ అయిపోవడం గ్యారంటీ. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.