ఈ పాపని చూడగానే.. అరే భలే ఉంది కదా అనిపించిందా? అనిపించే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా సరే ఫేమ్ తెచ్చుకుంది. చాలామందికి ఫేవరెట్ కూడా అయిపోయింది. మరోవైపు హీరోయిన్ గా కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలోనే తనతో పాటు కలిసి నటించిన స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఓ పాపకు తల్లి కూడా అయింది. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తోంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి సాయేషా సైగల్. బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్-సైరా భానుల మనవరాలు ఈమె. ఇకపోతే అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్’ సినిమాతోనే సాయేషా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాఫ్ కావడంతో తెలుగులో ఆమెకి అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళంలోకి షిప్ట్ అయింది. అలా అక్కడే స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యతో గజనీకాంత్, కాప్పన్, టెడ్డీ సినిమాలు చేసింది. ఇలా కలిసి నటిస్తున్న టైంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. 2019లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.
‘సార్పట్ట పరంపర’ సినిమాతో గతేడాది హిట్ కొట్టిన ఆర్య.. రీసెంట్ గా ‘కెప్టెన్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఏలియన్ జానర్ కథతో తీసిన ఈ సినిమా.. ఆడియెన్స్ కి అంతగా ఎక్కలేదు. మరోవైపు ‘ద విలేజ్’ వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో గతంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘వరుడు’లో విలన్ గా చేసింది కూడా ఆర్యనే. ఇదంతా పక్కనబెడితే ఆర్య- సాయేషా దంపతులకు ప్రస్తుతం ఓ పాప ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న సాయేషా.. రీఎంట్రీకి సిద్ధమవుతోంది. త్వరలో అందుకు సంబంధించిన ప్రకటన రావొచ్చు.