తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన అభిమానులు విజయ్‌ను దళపతి అని ముద్దుగా పిలుస్తుంటారు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అభిమానులంటే విజయ్ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ప్రస్తుతం లక్షల మంది అభిమానాన్ని చూరగొంటున్న విజయ్ ఓ ఇంట్రావర్ట్. బయటి వ్యక్తులతో పెద్దగా కలవరు. ఇప్పుడంటే అంతో ఇంతో ఫ్రీగా ఉంటున్నారు కానీ, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటించటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా హీరోయిన్లతో ముద్దు సీన్లప్పుడు బిగుసుకుపోయేవారు. ఈ విషయాన్ని ప్రముఖ హీరోయిన్ సంఘవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. విజయ్‌తో హీరోయిన్‌గా చేసిన అనుభవాలను ఆమె మీడియాతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ ‘‘ నేను విజయ్‌తో కలిసి ‘‘రసిగన్’’ సినిమాలో నటించాను. ఆ సినిమాకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. చెరువులో ఇద్దరి మధ్యా ఓ రొమాంటిక్ సీన్ ఉంది. ఆ సమయంలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇద్దరం అందులో స్నానం చేసి బయటకు రావాలి. నేను సింపుల్‌గా చేశాను. విజయ్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నీళ్లు బాగా చలిగా ఉండటంతో వణికిపోతూ ఉన్నాడు. ఇది చూసిన చంద్రశేఖర్‌గారు ‘ ఆ అమ్మాయి చేస్తోంది కదా? నువ్వు చేయటానికి ఏం ఇబ్బంది? అంటూ విజయ్‌పై కేకలు వేశారు. విజయ్ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. బయటి వాళ్లతో ఎక్కువగా మాట్లాడరు. ఆయనతో క్లోజ్ అయిన వారితోనే మాట్లాడతారు. ఆయన నాతో చాలా ఫ్రీగా ఉండేవారు.
సీన్ పేపర్లు ఇద్దరం కలిసి చదువుకుని చేసేవాళ్లం’’ అని అన్నారు. కాగా, సంఘవి ‘అమరావతి’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో అజిత్ సరసన నటించారు. రెండో సినిమా ‘రసిగన్’ ఈ సినిమాలో విజయ్ సరసన నటించారు. 1995లో వచ్చిన ‘తాజ్‌మహాల్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. పలు హిట్టు సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. 90లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. మరి, సంఘవితో రొమాంటిక్ సీన్ విషయంలో తండ్రి విజయ్‌కు చివాట్లు పెట్టిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.