ఈమె స్టార్ హీరోయిన్. బోల్డ్, డీ గ్లామర్, యాక్షన్.. ఇలా ఏ తరహా రోల్స్ అయినా ఈజీగా చేసేస్తుంది. తాజాగా ఆమె ఓల్డ్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఎవరో కనిపెట్టారా?
ఈ బ్యూటీ పేరు చెప్పగానే మంచి మంచి సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు 13 ఏళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తూ వచ్చింది. స్టార్ హీరోయిన్ గా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఓ పాన్ ఇండియా సినిమాతో వచ్చింది కానీ భారీ ఫ్లాప్ అందుకుంది. దానికి తోడు ఈ మూవీ రిలీజ్ టైంలో ఆమె చేసిన ఓ పని.. తాజాగా బోలెడన్ని విమర్శలకు కారణమైంది. ఆమె చాలా ఓల్డ్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఆ ఫొటో సంగతేంటనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే… పైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఉన్న భామ పేరు సమంత. తమిళనాడులో పుట్టి పెరిగింది. కాలేజీ టైంలోనే మోడలింగ్ చేసింది. ఓవైపు చదువుతూనే మరోవైపు పార్ట్ టైమ్ గా కొన్ని కొన్ని యాడ్స్ లో యాక్ట్ చేసింది. అలా ‘మాస్కోవిన్ కావేరి’ అనే చిత్రంతో నటిగా మారింది. ఈ మూవీ కంటే ముందు నాగచైతన్యతో చేసిన ‘ఏ మాయ చేశావె’ విడుదలైంది. ఇదే హిట్ అయ్యేసరికి సమంతకు వరస ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ తో కలిసి వర్క్ చేసి, సూపర్ హిట్స్ కొట్టింది.
రీసెంట్ టైంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తూ వస్తోంది. గతేడాది చివర్లో ‘యశోద’గా వచ్చిన సామ్.. యావరేజ్ టాక్ తో ఓకే అనిపించుకుంది. కొన్నిరోజుల ముందొచ్చిన ‘శాకుంతలం’ అయితే ఘోరంగా ఫెయిలైంది. పెట్టుబడిలో 5-10 శాతం కూడా రాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ సినిమా గురించి దాదాపుగా మర్చిపోయిన సామ్.. ఈ మధ్య ‘సిటాడెల్’ ప్రమోషన్ కోసం విదేశాలకు వెళ్లొచ్చింది. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో 16 ఏళ్ల దిగిన పిక్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్.. తనపై వస్తున్న నెగిటివిటీని డైవర్ట్ చేయడానికే పోస్ట్ చేసిందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ పిక్ చూసి ఆమెన మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.