సాయిపల్లవి ఒక్కటే పీస్. హైబ్రీడ్ పిల్ల కూడా. మిగతా హీరోయిన్లు.. ఈమె దరిదాపుల్లోకి కూడా రారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కానీ సాయిపల్లవి మాత్రమే ఎందుకంత స్పెషల్?
కొందరు హీరోయిన్లు అవసరమున్నా లేకపోయినా తెగ చూపించేస్తుంటారు. మరికొందరు మాత్రం విపరీతమైన టాలెంట్స్ ఉన్నా చాలా కంట్రోల్ గా ఉంటారు. ముద్దుగుమ్మ సాయిపల్లవి రెండో కేటగిరీలోకి వస్తుంది. ఆమె చేసిన సినిమాలు జస్ట్ వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ప్రతిదీ ఆణిముత్యం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పం కానీ మూవీ లవర్స్ కి అవన్నీ చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే అందులో సాయిపల్లవి ఉంది, యాక్టింగ్ తో రఫ్ఫాడించేసింది కాబట్టి. హీరోయిన్ అనే ట్యాగ్ పక్కనబెట్టి చూసినా సరే సాయిపల్లవిలో లెక్కకు మించి టాలెంట్స్ ఉన్నాయి. ఒక్కోదాని గురించి పొగుడుతూ వెళ్లినా ఈజీగా వారం పడుతుంది. ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా వాటన్నింటిని గురించి అలా ఓసారి మాట్లాడేసుకుందాం.
అసలు విషయానికి వచ్చేస్తే.. సాయిపల్లవి పుట్టి పెరిగిందంతా తమిళనాడులోని కోటగిరి అనే కొండ ప్రాంతంలో. ఈమెది బడగ అనే గిరిజిన తెగ. తండ్రిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలా సాయిపల్లవి మారమూల పల్లెటూరిలో పుట్టినాసరే బాగా చదువుకుంది. ఓ మంచి పొజిషన్ లోకి వచ్చేసింది. ఈమెకు పెళ్లి చేసే విషయంలో తప్పితే మరే దానిలోనూ సాయిపల్లవి పేరెంట్స్ కి బెంగ లేదనిపిస్తోంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఉండటం చాలా అరుదు.
చాలామంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటారు. కానీ సాయిపల్లవి మాత్రం అటు డాక్టర్ కోర్స్ చేస్తూనే సినిమాలు చేసింది. ఇలా రెండింటిని ఫెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన ఈ బ్యూటీ.. భవిష్యత్తులో సొంతంగా హాస్పిటల్ కూడా పెడతానని ఓ సందర్భంలో చెప్పింది. దీన్నిబట్టి చూస్తే సాయిపల్లవిలో అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి కూడా ఉందని అర్ధమవుతోంది.
సాయిపల్లవి పేరు చెప్పగానే నో మేకప్, నో ఎక్స్ పోజింగ్.. ఓన్లీ టాలెంట్ మాత్రమే అని గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోయిన్ గా చేసిన ఫస్ట్ మూవీ ‘ప్రేమమ్’ (మలయాళం) నుంచి గతేడాది వచ్చిన ‘గార్గి’ మూవీ వరకు ప్రతి సినిమాలో చాలా నేచురల్ గా కనిపించింది. యాక్టింగ్, డ్యాన్స్, అందం.. ఇలా అన్ని విషయాల్లో బెస్ట్ ఉన్నా ఎక్కడా గీత దాటలేదు. ఎక్స్ పోజింగ్ మితిమీరిపోయిన మూవీ ఇండస్ట్రీలో దీనికి నో చెప్పి కూడా సినిమాలు చేసిందంటే.. మనం కచ్చితంగా మెచ్చుకుని తీరాలి.
సాయిపల్లవి పేరు చెప్పగానే చాలామందికి ఆమె వండర్ ఫుల్ స్టెప్పులే గుర్తొస్తాయి. టీనేజ్ లో ఉన్నప్పుడు తెలుగులో ‘ఢీ’ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చదుపుపై కాన్సంట్రేట్ చేసింది. బై ఛాన్స్ హీరోయిన్ అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడమే కాదు అద్భుతమైన క్రేజ్, కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క మూవీ కూడా లేదు. అయినాసరే అభిమానులు ఇప్పటికీ, ఎప్పటికీ ఈమెని ఇష్టపడుతూనే ఉంటారు. అదిదా సాయిపల్లవి క్రేజ్.
చాలామంది సెలబ్రిటీలు డబ్బుల కోసం యాడ్స్ తెగ చేసేస్తుంటారు. సాయిపల్లవికి అలాంటి బోలెడు ఆఫర్స్ వచ్చాయి. చేస్తే కోట్ల రూపాయిలు ఇస్తామన్నారు. కానీ వాటికి చాలా స్మూత్ గా నో చెప్పేసింది. మరోవైపు సినిమాల్లో కొందరు హీరోయిన్లు పద్ధతిగా కనిపిస్తారు. బయటమాత్రం బికినీ, గ్లామర్ విషయంలో రెచ్చిపోతుంటారు. సాయిపల్లవి మాత్రం మూవీస్ లో ఎలా ఉంటుందో.. బయటకూడా అలానే కనిపిస్తుంది. చెప్పాలంటే బయటనే ఇంకా అందంగా ఉంటుంది. కుర్రాళ్లయితే ఈమె మాయలో పడకుండా అస్సలు ఉండలేరు.
చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ వస్తే డ్యాన్స్ రాదు, డ్యాన్స్ వస్తే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేరు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. సాయిపల్లవిలో మాత్రం అన్నీ ఉంటాయి. అందుకే ఈమె డ్యాన్స్ చేసిన ‘రౌడీ బేబీ’, ‘వచ్చిండే పిల్ల’, ‘సారంగ దరియా’ లాంటి సాంగ్స్.. యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ విషయంలో మరే హీరోయిన్ కూడా సాయిపల్లవి దరిదాపుల్లోకి కూడా రాదు. దీనికోసమైనా సరే సాయిపల్లవిని మెచ్చుకుని తీరాలి.
చాలామంది హీరోయిన్లు.. ఒకటో రెండో సూపర్ హిట్స్ పడేసరికి తామేదే సెలబ్రిటీలు అయిపోయామని తెగ పోజులు కొడుతుంటారు. ఓ పెద్ద టీమ్, బౌన్సర్లని పెట్టుకుని తెగ హడావుడి చేస్తుంటారు. వాళ్లందరితో పోలిస్తే సాయిపల్లవి చాలా అంటే చాలా డిఫరెంట్. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని కూడా సింపుల్ గా స్కార్ఫ్ కట్టుకుని థియేటర్ కి వెళ్తుంది. ఎగ్జామ్ రాయడానికి కూడా జస్ట్ నార్మల్ డ్రస్ వేసుకుని వెళ్లిపోతుంది. అందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని గతంలో వైరల్ అయ్యాయి. మీరు కూడా చూసే ఉంటారు. ఇలా ఒకటి రెండు కాదు చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. సో అదన్నమాట విషయం. సాయిపల్లవి ఎందుకు స్పెషలో మేం చెప్పాం కదా.. ఒకవేళ మేం ఏమైనా మిస్ చేసుంటే కింద కామెంట్ చేయండి.