సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె కూడా స్టార్ హీరోయిన్ అవుతానని ఊహించి ఉండదు. ఎక్కడ బెంగళూరు.. ఎక్కడ ముంబయి.. జస్ట్ ఆరేళ్లలోనే స్టార్ డమ్ సంపాదించింది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆమెని ఇష్టపడే అభిమానులు కోట్లాదిమంది. అలానే ఆమెని విమర్శించే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయినా సరే ఆమె ఎప్పుడూ ఎక్కడా తగ్గలేదు. హీరోయిన్ గా ఓవైపు, సోషల్ మీడియాలో తన క్యూట్ పోజులతో మరోవైపు.. ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఉంది. ఇక డ్యాన్సుల్లోనూ హీరోలకు తగ్గట్లే మూమెంట్స్ వేస్తుంది. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి రష్మిక మందాన. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. బెంగళూరులో పెరిగిన రష్మిక.. చదువుతున్న టైంలో అంటే 2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తన ఫస్ట్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక కన్నడ నుంచి తెలుగులోకి షిప్ట్ అయిన రష్మిక.. ‘ఛలో’తో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత యంగ్ హీరోస్, స్టార్ హీరోస్ సినిమాల్లో నటిస్తూ యమ క్రేజ్ సంపాదించింది.
గతేడాది వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’లో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక.. దేశమొత్తం తెగ పాపులర్ అయిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘సామి సామి’ పాటకు స్టెప్పుస్తూ మరింత క్రేజ్ సంపాదించింది. ఇక ఈమె నటించిన తొలి హిందీ సినిమా ‘గుడ్ బై’ రీసెంట్ గానే రిలీజైంది. కానీ ప్రేక్షకాదరణ పెద్దగా దక్కించుకోలేకపోయింది. బాలీవుడ్ లోనే మరో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇక తెలుగులోనూ ‘పుష్ప 2’ షూటింగ్ కి సిద్ధమవుతోంది. మరోవైపు రౌడీహీరో విజయ్ దేవరకొండతోనూ ఈమె రిలేషన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాకపోతే దీనిపై ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే గానీ అసలు విషయం బయటకొస్తుంది. మరి రష్మిక చిన్నప్పటి ఫొటోస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.