హీరోయిన్ రష్మిక ఏం చేసినా సరే సోషల్ మీడియాలో వైరల్ కావడం గ్యారంటీ. ఇప్పుడు అలానే ఆమె వేసుకున్న టాప్ కాస్ట్ తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
హీరోహీరోయిన్లు ఎవరైనా సరే చాలా బిజీగా ఉంటారు. షూటింగ్స్ లో ఏ మాత్రం బ్రేక్ దొరికినా సరే విదేశాలకు విహారయాత్రలకు వెళ్లిపోతారు. ఫుల్ గా చిల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ షాపింగ్ చేస్తూ బిజీగా మారిపోతుంటారు. హీరోలేమో గానీ హీరోయిన్ల మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ రష్మిక కూడా అలానే ఓ కాస్ట్ లీ టాప్ కొన్నట్లు కనిపిస్తుంది. వరస హిట్స్ కొట్టి చాలా తక్కువ టైంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు డ్రస్సింగ్ లోనూ తన రేంజ్ చూపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ బ్యూటీ రష్మిక ‘కిరాక్ పార్టీ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఇక తన దొరికిన ఫ్రీ టైమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా దుబాయి వెళ్లింది. ‘వారసుడు’ హిట్ తో ఫుల్ ఖుషీలో ఉన్న రష్మిక.. దుబాయిలో రిలాక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తన షాపింగ్ తో అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఆమె కొన్న ఒక్క టాప్ ధర అలా ఉంది మరి.
ఎందుకంటే రీసెంట్ కొన్ని ఫొటోలను రష్మిక పోస్ట్ చేసింది. ఇందులో వైట్ కలర్ టాప్ వేసుకుని ఉంది. లూయిస్ వ్యూట్టన్ కంపెనీకి చెందిన సమ్మర్ స్టార్ డస్ట్ క్రాప్ట్ కార్డిగన్ అని పిలిచే ఈ టాప్ ఖరీదు అక్షరాలా రూ.2,68, 987 అని తెలుస్తోంది. ఇంత ఖరీదైన వస్తువులు, డ్రస్సులు కొనడం సెలబ్రిటీలకు సాధారణ విషయమే అయినప్పటికీ.. నెటిజన్స్ ‘ఓ మై గాడ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ ట్రిప్ కి రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లాడని తెలుస్తోంది. మరి రష్మిక కాస్ట్ లీ షాపింగ్, అక్కడ కొనుగోలు చేసిన టాప్ గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.