ఆమె స్టార్ హీరోయిన్. ఐదేళ్లలో దాదాపు 30 సినిమాలు చేసింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మరి ఆమెని గుర్తుపట్టారా?
ఆమెకు అస్సలు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. కానీ సడన్ గా అవకాశం వచ్చేసరికి హీరోయిన్ అయిపోయింది. ఒకే సినిమాతో రెండు భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ అగ్రహీరోలకు హీరోయిన్ గా చేసింది. ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిందో అంతే ఫాస్ట్ గా యాక్టింగ్ కి బైబై చెప్పేసింది. ఓ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం రాజకీయ నాయకురాలు, నిర్మాతగా ఫుల్ బిజీగా మారిపోయింది. గతేడాది ఓ సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. మరి ఇంతలా చెబుతున్నాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇండస్ట్రీకి చెందినవారే. తల్లి నటి, తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అలా ఈమె చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగింది. కానీ ఎప్పుడూ ఆ వైప్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘అప్పు’తో హీరోయిన్ అయిపోయింది. ఆమె పేరు రక్షిత. అదే సినిమాని తెలుగులో ‘ఇడియట్’ పేరుతో తీస్తే.. ఇక్కడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సూపర్ హిట్ కొట్టేసింది. ఇలా నెలల వ్యవధిలో తెలుగు, కన్నడలో సక్సెస్ అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఐదేళ్లలో మొత్తంగా 29 సినిమాలు చేసింది. కెరీర్ లో చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. తమిళ, కన్నడ భాషల్లోనూ అప్పటి అగ్రహీరోల మూవీస్ లో హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకుని నటనకు పూర్తిగా స్వస్తి చెప్పింది. ఆ తర్వాత నిర్మాతగా భర్త దర్శకత్వంలో పలు సినిమాలు తీసింది. ఇక పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె.. రెండేళ్లలో మూడు పార్టీలు మారింది. ప్రస్తుతం బీజేపీలో ఉంది. రీసెంట్ గా ఈమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుత ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. మరి ఈ హీరోయిన్ ప్రెజెంట్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.