పైన ఫొటోలో కనిపిస్తున్న పాప, వెనక నిల్చున్న ఆమె.. ఇద్దరూ హీరోయిన్లే. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రికార్డు ఈమె సొంతం. మరి ఈ ఇద్దరూ ఎవరో కనిపెట్టారా?
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే వారసత్వం అనేది చాలా కామన్ గా వినిపించే పదం. ఎంత నెపోటిజం బ్యాచ్ అయినాసరే యాక్టింగ్ బాగా చేసి, హిట్స్ కొడితేనే కెరీర్ లో నిలబడగలుగుతారు. లేదంటే కొత్త మూవీ ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోతారు. పైన ఫొటోలో కనిపిస్తున్న తల్లికూతురు విషయంలోనూ సేమ్ ఇలానే జరిగింది. తల్లి హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో నటించింది. కానీ కూతుళ్లు మాత్రం ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల ముందు ‘బీబీ జోడీ’ పేరుతో డ్యాన్స్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది. అందులో ఒకామె జడ్జిగా వచ్చింది. ఆమెని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా.. యస్ మీరు అనుకున్నది కరెక్ట్. మెగాస్టార్ చిరంజీవితో అప్పట్లో వరసపెట్టి సినిమాలు చేసిన రాధనే పై ఫొటోలో ఉన్నది. కొండవీటి రాజా, యముడికి మొగుడు,రాక్షసుడు, రుద్రనేత్ర లాంటి మూవీస్ చేసింది. ఓవరాల్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కలిపి 100కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం షోలు చేస్తూ బిజీగా ఉంది.
ఈ 80స్ హీరోయిన్ కు మొత్తం ముగ్గురు పిల్లలు. వాళ్లలో ఇద్దరమ్మాయిలు కార్తీక, తులసి హీరోయిన్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నాగచైతన్య ‘జోష్’తో హీరోయిన్ గా పరిచయమైన కార్తీక.. ఆ తర్వాత ‘రంగం’తో హిట్ కొట్టింది. తెలుగులో ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ చిత్రాల్లో నటించింది కానీ పేరు రాలేదు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. రాధ చిన్నకూతురు తులసి.. మణిరత్నం తీసిన ‘కాదల్'(తెలుగులో ‘కడలి’)తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమా మాత్రమే చేసింది. ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఫైన ఫొటోలో రాధతో పాటు ఉన్నది చిన్న కూతురు తులసినే. మరి ఈ పిక్ చూడగానే మీలో ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారు? కింద కామెంట్ చేయండి.