శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని శ్రీ కృష్ణుడిలా ముస్తాబు చేయడం మామూలే. మగ పిల్లలనే కాకుండా ఆడ పిల్లల్ని కూడా చిన్ని కృష్ణుడిలా ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. ఆ కృష్ణ భక్తికి సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. కాబట్టి తమ భక్తిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విషయంలో హీరోయిన్ ప్రణిత సుభాష్ ఎప్పుడూ ముందుంటారు. మామూలుగానే ప్రణితకి దైవ భక్తి ఎక్కువ. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు. హిందూ ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇటీవల భీమన అమావాస్య సందర్బంగా తన భర్త నితిన్ రాజు పాదాలకు పూజ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజాగా ఆమె మరోసారి తన దైవ భక్తిని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ప్రణిత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ మహాలక్ష్మిని శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుడిలా అలంకరించారు ప్రణిత. ఆ పాపకి తెల్లని ధోతీ కట్టి, నెత్తిన బుల్లి కిరీటం, పాప బుల్లి చేతిలో వేణువు పెట్టి.. ఒడిలో కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. “కృష్ణ జన్మాష్టమి. నా కూతుర్ని కృష్ణుడిలా అలంకరించాను. హ్యాపీ జన్మాష్టమి, ధర్మో రక్షతి రక్షితః, కృష్ణజన్మాష్టమి” అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోల్లో పాపకి దిష్టి తగులుతుందేమోనని పాప ముఖం కనబడకుండా జాగ్రత్త పడ్డారు ప్రణిత. ప్రస్తుతం ప్రణిత తయారుచేసిన చిన్ని కృష్ణుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ప్రణిత తన ఇంటి బుల్లి మహాలక్ష్మిని చిన్ని కృష్ణుడిగా అలంకరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Krishna Janmashtami . Dressed my little baby girl like krishna today .. #Janmashtami #happyjanmashtami #Dharmorakshathirakshathah #KrishnaJanmashtami pic.twitter.com/kY0Uqghhcj
— Pranitha Subhash (@pranitasubhash) August 19, 2022