ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం సినిమాల్లోనే గ్లామర్ చూపించేవారు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత సదరు బ్యూటీస్, ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. సోషల్ మీడియా వేదికగా తన బ్యూటీని చూపిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాలో ఈ తరహా ఫొటోస్ కి కొదవలేదు. టైంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడూ ఇలాంటి ఫొటోస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫామ్ లోని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి నార్మల్ హీరోయిన్ వరకు ఎవరూ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గరు. చెప్పాలంటే పోటీపడి మరీ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది.
ఇక విషయానికొస్తే.. ‘కంచె’ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. బాలయ్య ‘అఖండ’లోనూ హీరోయిన్ గా చేసిన ఈ భామ.. గతేడాది రిలీజైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’లో ఓ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సినిమాలు గానీ వెబ్ సిరీస్ ల్లో గానీ నటించని ఈ భామ.. గ్లామర్ ట్రీట్ తో ఫ్యాన్స్, నెటిజన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. తాజాగా అలానే ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి అయితే చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉన్నాయి.
తాజాగా విహారయాత్రలో ఉన్న ప్రగ్యాజైస్వాల్.. ఏదో హిల్ స్టేషన్ కు వెళ్లినట్లు కనిపిస్తుంది. ఇక రూమ్ కు ఆనుకుని ఉన్న స్విమ్మింగ్ పూల్ లో రెడ్ బికినీతో కుర్రాళ్లకు ట్రీట్ ఇచ్చే పోజుల్లో కవ్విస్తోంది. ‘చలికాలంలో సూర్యడు.. వేసవిని గుర్తుచేస్తున్నాడు’ అని కిరాక్ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ అయితే సూపర్, హాట్ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రగ్యా జైస్వాల్.. హాట్ పోజులు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.