ఆమెని చూస్తే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటి ఆ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
పాపని చూడగానే భలే ముద్దేసింది కదా! కచ్చితంగా అలా అనిపించి ఉంటుంది. ఎందుకంటే నీట్ గా డ్రస్ వేసుకుని, తలకు పూలు పెట్టుకుని కనిపిస్తున్న ఈ చిన్నారి పుట్టింది హైదరాబాద్ లోనే కానీ పెరిగింది మాత్రం వేరే చోట. అయితేనేం పెద్దయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి హీరోయిన్ గా సెటిలైపోయింది. గ్లామర్ కు హద్దులు చెరిపేసింది. ఇప్పుడు ఆమె ఫొటో పోస్ట్ చేయడమే లేటు.. తెలుగు ప్రేక్షకులు ఎగబడతారు. అమాయకంగా కనిపించే ఆమె క్యూట్ ఫేస్ కు ఫ్యాన్ అయిపోతారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలు పద్ధతిగా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న ఈ భామ.. పుట్టింది హైదరాబాద్ లో. పెరిగింది మాత్రం బెంగళూరులో. మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో 2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. ఇందులో పాల్గొన్న కొన్నేళ్లకు హిందీ మూవీ ‘మున్నా మైఖేల్’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా హీరోయిన్ గా మారిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత పూర్తిగా తెలుగు వరకే పరిమితమైంది.
నాగచైతన్య ‘సవ్యసాచి’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో తదితర సినిమాలు చేసింది. వీటిలో పూరీ జగన్నాథ్ తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం నిధి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్. అది తప్పించి ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సినిమా లేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’పైనే ఈమె పూర్తిగా ఆశలు పెట్టేసుకుంది. అయితే సినిమా ఆలస్యమవుతూ వస్తుండటం ఆమెకు సమస్యగా మారింది. ఎందుకంటే నిధి అగర్వాల్ చేతిలో ఇది తప్పించే వేరే సినిమాలు లేవు. చూడాలి ఏం జరుగుతుందో? సరే ఇదంతా పక్కనబెట్టండి.. నిధి అగర్వాల్ చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.