తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు నందిత శ్వేత. ఈమె హీరోయిన్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించారు. తన తొలి తెలుగు సినిమా ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, అధినేత్రి, 7, కల్కి, కపలధారి, అక్షర వంటి సినిమాల్లో నటించారు. ఇక, నందిత శ్వేత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా..
సోషల్ మీడియాల లైవ్‌లకు వచ్చి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్‌లోకి వచ్చారు. తన ఫ్యాన్స్‌తో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఆమె తలపట్టుకున్నారు. ఈ ఫ్యాన్ ఏం ప్రశ్న అడిగాడంటే.. ‘‘ మీ పాదాలు బాగున్నాయి. నేను మీ పాదదాసుడ్ని అయిపోతాను’’ అని అన్నాడు. ఇందుకు నందిత ‘‘ ఎందుకు నాకే ఇలాంటి భయంకరమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి’’ అంటూ తల పట్టుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా, నందిత శ్వేత ‘‘నంద లవ్స్ నందిత’’ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆటకత్తి సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. పలు మంచి మంచి సినిమాల్లో నటించారు. ఇక, తెలుగు, తమిళంలో సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తున్నారు. మరి, నందిత శ్వేతను ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసిన ఆమె ఫ్యాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Nandhitha reacts to fans absurd fantasy !! pic.twitter.com/lnQFAegEzz
— Viral Briyani (@Mysteri13472103) February 3, 2023