హీరోయిన్ నమిత ప్రస్తుతం తన జీవితంలోని ఎంతో అపురూప క్షణాలను గడుపోతంది. నమిత- వీరేంద్ర చౌదరి త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. నమిత తల్లి కాబోతున్న విషయాన్ని చాలా రోజులు అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. తన 41వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బోబీ బంప్ ఫొటో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఎందరో సెలబ్రిటీలు సరోగసీ వంటి పద్దతుల ద్వారా అద్దె గర్భాల్లో పిల్లలను కంటుంటే.. నమిత మాత్రం ఒక స్త్రీగా తన జీవితంలోని అద్భుతమైన క్షణాలను ఎంజాయ్ చేస్తోంది. నమిత కూడా అందరిలాగానే నవమాసాలు మోసి తన బిడ్డకు జన్మనిస్తోంది.
ఇటీవల నమితకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం నిర్వహించారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతకు ముందు నుంచే నమిత బేబీ బంప్ తో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. బేబీ బంప్ తో నమిత- వీరేంద్ర చౌదరి చేసిన ఫొటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంక నమిత సినిమా కెరీర్ విషయానికి వస్తే.. సొంతం సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది ఈ బొద్దు గుమ్మ. ఆ తర్వాత జెమిని, బిల్లా వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆమె నటన, అందం, అభినయానికి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నమితపై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ గుడి కూడా కట్టేశారు.
నమిత కెరీర్లో 2002 నుంచి 2009 వరకు బాగా సాగింది. కానీ, ఆ తర్వాత హీరోయిన్ గా నమిత కెరీర్ బాగా నెమ్మదించిందనే చెప్పాలి. 2010 నుంచి అడపాదడపా సినిమాల్లో కనిపించింది. 2017లో వీరేంద్ర చౌదరిని తిరుపతిలో వివాహం చేసుకుని వైవాహిక జీవితంపై ఎక్కువ దృష్టి సారించింది.