ఆమెని చూస్తే ఎవరికైనా సరే నచ్చేస్తుంది. ఎందుకంటే క్యూట్ నెస్ అలా మెంటైన్ చేస్తూ ఉంటుంది. పెద్దయ్యాక కాదు.. చిన్నప్పటి నుంచి అదే అందాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇక హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆమెని చూడగలిగాం. ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం. కన్నడ భామనే అయినప్పటికీ.. తెలుగులోనే హీరోయిన్ గా సెటిలైపోయింది. స్టార్ హోదా కూడా దక్కించుకుంది. వరస సినిమాలు చేసిన ఆ భామ చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి నభా నటేష్. డిసెంబరు 11న పుట్టిన ఈమె.. స్కూల్ ఏజ్ లో డ్యాన్స్, మోడలింగ్ పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. పలు అవార్డులు కూడా గెలుచుకుంది. పలు నాటకాల్లోనూ యాక్ట్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అలా 19 ఏళ్ల ఏజ్ లోనే నటిగా తొలి ఛాన్స్ వచ్చింది. అది కూడా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘వజ్రకాయ’లో ఓ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సొంత భాషలోనే లీ, సాహోబా అనే సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో తొలి అవకాశం వచ్చింది.
సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి నభా నటేష్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతో గుడ్ ఫెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. దీంతో ఈమెకు వరసగా అవకాశాలు వరించాయి. అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతానికి అయితే సినిమాలు ఏం చేయనట్లే కనిపిస్తుంది. ఈమె చేసిన అన్ని సినిమాల్లోనూ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. యాక్టింగ్, గ్లామర్ విషయంలో టాలెంటెడ్ అయిన ఈమె హిట్స్ దక్కకపోవడంపై ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.