పైన ఫొటోలో కనిపిస్తున్న పాప.. తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. ఓ యంగ్ హీరోని లవ్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. మరి ఎవరో కనిపెట్టారా?
ఈమె స్టార్ హీరోయిన్ కాదుగానీ గుర్తింపు మాత్రం అలానే తెచ్చుకుంది. తెలుగులో హీరోయిన్ గా ఒక్కటే మూవీ చేసినప్పటికీ క్రేజ్ బాగానే సంపాదించింది. సాధారణంగా హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. అలాంటి ఈ బ్యూటీ.. సినిమాలో తనతోపాటు యాక్ట్ చేసిన హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో వరస మూవీస్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్ని చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ముద్దుగుమ్మలు భలే ఉంటారు. తెలుగులో చాలామంది కేరళ బ్యూటీస్ ఇప్పటికే హీరోయిన్లుగా యమ క్రేజ్ సంపాదించారు. మరోవైపు గౌతమ్ మేనన్ ఎవరినైనా హీరోయిన్ ని పరిచయం చేశాడంటే కచ్చితంగా ఆమెలో స్పార్క్ ఉంటుంది. ‘ఏ మాయ చేశావె’తో సమంతని తీసుకొస్తే.. ఆమె స్టార్ అయిపోయింది. అలా ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మాంజిమ మోహన్ అనే కేరళ కుట్టిని తెలుగులోకి హీరోయిన్ గా పరిచయం చేశాడు.
నాగచైతన్య చేసిన ఈ మూవీ సరిగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సులు రాలేదు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నారా భువనేశ్వరి రోల్ లో కాసేపు కనిపించింది అంతే. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మాంజిమ.. తనతో కలిసి ‘దేవరాట్టమ్’లో నటించిన గౌతమ్ కార్తీక్ ని రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కాస్తంత బొద్దుగా ఉన్న ఈమె.. యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తుంది. బహుశా ఆమె త్వరలో యాక్టింగ్ కి టాటా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు? కింద కామెంట్ చేయండి.