పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి.. రీసెంట్ టైంలో తెలుగు సినిమాలు చేసిన హీరోయిన్. ఈమె నటి మాత్రమే కాదండోయ్ హైకోర్టులో లాయర్ కూడా. మరి ఎవరో గుర్తుపట్టారా?
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’… ఇది చాలామంది హీరోయిన్లు చెప్పే మాట. ఒకప్పుడేమో కానీ ఇప్పడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు తమకు నచ్చిన స్టడీస్ కంప్లీట్ చేస్తున్నారు. రెండింటిలోనూ తోప్ అనిపించుకుంటున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలనే తీసుకోండి. ఓవైపు డాక్టర్ కోర్స్ చదువుతూనే మరోవైపు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించింది. పైన కనిపిస్తున్న హీరోయిన్ కేవలం నటి మాత్రమే కాదు హైకోర్టులో లాయర్ కూడా. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా రవితేజ ‘నేల టిక్కెట్టు’ మూవీతో తెలుగులోకి వచ్చిన బ్యూటీ మాళవిక శర్మ. పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఈమెనే. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. టీనేజ్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు యాడ్స్ లో కనిపించి చాలా పేరు తెచ్చుకుంది. అదే టైంలో తెలుగులో హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. అలా ‘నేల టిక్కెట్టు’, రెడ్, కాఫీ విత్ కాదల్ (తమిళ) సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కొంతలో కొంత గుర్తింపు తెచ్చుకుంది.
సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలోనూ నటించిన మాళవిక శర్మ.. రియల్ లైఫ్ లో లాయర్ అని చాలామందికి తెలియదు. అవును మీరు విన్నది నిజమే. క్రిమినాలజీలో LLB కోర్సు పూర్తి చేసిన ఆమె.. ముంబయి బార్ కౌన్సిల్ లో మెంబర్ కూడా. ఈమెని చూస్తే అస్సలు అలా అనిపించదు. ఎందుకంటే గ్లామర్ తో హద్దులు చెరిపేలా పోజులిస్తూ ఉంటుంది. చూస్తే ఎవరైనా సరే అస్సలు తల తిప్పరు, మైండ్ కంట్రోల్ చేసుకోలేరు. అంత అందంగా ఉంటుంది. మరి ఈ హీరోయిన్ చిన్నప్పటి చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.