ఆమె పేరులోనే అందానికి డెఫినిషన్ ఉంది. ఇక ఫస్ట్ మూవీతోనే యూత్ మనసుల్లో చెరిగిపోని ప్లేస్ సంపాదించుకుంది. ఇక ఆమె సొట్టబుగ్గలకు అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగమ్మాయి కాకపోయినా సరే చూస్తే అచ్చ తెలుగందంలా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ రోజు ఆమె 32వ పుట్టినరోజు కూడా జరుపుకొంది. ఆమె గురించి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పుడు ముద్దుగా ఉన్న ఓ ఫొటో కూడా వైరల్ గా మారింది. దానికి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి లావణ్య త్రిపాఠి. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో పుట్టిన ఈమె.. డెహ్రాడూన్ లో స్టడీస్ పూర్తి చేసింది. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్న లావణ్య.. ముంబయిలో డిగ్రీ చదువుతున్న టైంలోనే యాక్టింగ్ ఛాన్సుల కోసం ప్రయత్నించింది. అంతకుముందు 2006లో మిస్ ఉత్తరాఖండ్ కూడా ఈమె టైటిల్ గెలుచుకుంది. ఇక హిందీ సీరియల్ ‘ష్ కోయి హై’ నటిగా కెరీర్ ప్రారంభించింది. అయితే పూర్తిస్థాయిలో నటిగా పరిచయమైంది మాత్రం ‘ప్యార్ కా బంధన్’ సీరియల్ తోనే. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’లో హీరోయిన్ గా అవకాశమొచ్చింది. తొలి చిత్రంలో చాలా అందంగా కనిపించి మార్కులు కొట్టేసింది. కుర్రాళ్ల మనసు దోచేసింది.
ఇక ఆ తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, అర్జున్ సురవరం, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘పులి-మేక’ అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తోంది. ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నటిగానే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ వైరల్ గా మారాయి. మరి లావణ్య సినిమాల్లో మీకు ఏది నచ్చింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.