మొదటి సినిమా ‘అందాల రాక్షసి’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. ఇప్పటి వరకు 10కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘లావణ్య త్రిపాఠి’. 2012లో వచ్చిన ‘‘అందాల రాక్షసి’’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక, సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే లావణ్య.. వీలు చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అవసరమైన వారికి తనవంతు సహాయం చేస్తూ ఉంటారు.
తాజాగా, హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని అనాథ విద్యార్థి గృహానికి ఆమె వెళ్లారు. అక్కడి పిల్లలతో సరదాగా గడపటమేకాకుండా వారికి అవసరమైన మందులను అందజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎల్‌బీ నగర్‌లోని అనాథ విద్యార్థుల ఆశ్రమానికి వెళ్లారు. కొన్ని గంటల పాటు వారితో సరదాగా గడిపారు. అక్కడి విషయాలను, విద్యార్థుల జీవిత విశేషాలను ఆశ్రమ వ్యవస్థాపకులు మార్గం రాజేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆమె తెలిపారు. ఆశ్రమంలోని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
పిల్లలకు అత్యవసరమైన మందులను అందజేశారు. అంతేకాదు! విద్యార్థులతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పిల్లలతో గడిపిన సమయం చాలా ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ‘‘ నేను కూడా 11 ఏళ్లుగా సినీరంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా. అవన్నీ దాటి నేడు ఓ మంచి నటిగా ఎదిగా. అవకాశాలు ఇచ్చిన దర్శకులకు, ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. మరి, లావణ్య త్రిపాఠి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Beautiful inside out! @Itslavanya paid a visit to Anaadha Vidyarthi Griha Orphanage and greeted the kids ❤️❤️
She spent some quality time at the Home, which made the kids truly happy. The smile say it all 🤩#LavanyaTripathi pic.twitter.com/1iUuTWGClI
— SivaCherry (@sivacherry9) April 24, 2023