ఈ ఆధునిక కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో.. కొంత మంది రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నారు. అదీ కాక ఏదైనా సినిమా నుంచి పాట కానీ, టీజర్ కానీ వస్తే.. అది సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది. తాజాగా ఓ పాట ఇలాగే మారుమ్రోగిపోతోంది. అదే నాని నటించిన ‘దసరా’ మూవీలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే పాట. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తాజాగా ఈ పాటకు లుంగీ కట్టి మాస్ డ్యాన్స్ చేసింది హీరోయి కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి చేసిన మాస్ డ్యాన్స్ నెట్టింట రచ్చ లేపుతూ.. వైరల్ గా మారింది.
కీర్తి సురేష్.. రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి చూపులోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో, అందంతో కట్టి పడేసింది కీర్తి. దాంతో వరుసగా సినిమా అవకాశాలు అమ్మడు తలుపు తట్టాయి. నేను లోకల్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించిన కీర్తికి.. మంచి పేరు తెచ్చిన చిత్రం మాత్రం ‘మహానటి’ మూవీ అనే చెప్పాలి. ఈ చిత్రంతో కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకుంది. దాంతో తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ అయిన ‘దసరా’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ మాస్ సాంగ్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే మాస్ సాంగ్ కు తాజాగా తన స్నేహితురాలుతో కలిసి.. లుంగీ కట్టి ఫుల్ మాస్ డ్యాన్స్ చేసింది కీర్తి. మధ్యలో వచ్చిన వ్యక్తిని కొట్టింత పని చేసి..”ఇది నా ధూమ్ ధామ్ దోస్తాన్.. మరి మీ ధూమ్ ధామ్ దోస్తాన్ ఎక్కడ? అంటూ అభిమానులను ప్రశ్నించింది. ఈ పాటలో తన స్నేహితురాలు అయిన అక్షిత సుబ్రహ్మణ్యంతో కలిసి డాన్స్ ఇరగదీసింది. ఈ డ్యాన్స్ చూసిన అభిమానులు”అమ్మో కీర్తి సురేష్ లో ఈ యాంగిల్ మాస్ డ్యాన్స్ మేం ఎప్పుడూ చూడలేదు.. సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. దసరా చిత్రానికి ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పతకాంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ బాణీలు సమకూరుస్తున్నాడు. 2023 మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.