హీరోయిన్ కీర్తి సురేష్ ముఖంపై దెబ్బలతో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది?
టాలీవుడ్ లో లెక్కపెట్టలేనంతమంది హీరోయిన్లు. వాళ్లందరినీ దాటుకుని స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. చెప్పాలంటే కొందరికే సాధ్యమవుతూ ఉంటుంది. అలాంటిది కేరళ కుట్టి కీర్తి సురేష్ దాన్ని చేసి చూపించింది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ భామ.. ‘మహానటి’తో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. రీసెంట్ గా ‘దసరా’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అలాంటి ఈమె ఇప్పుడు సడన్ గా ముఖంపై గాయాలతో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారుపడిపోయారు. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. హీరోయిన్ కీర్తిసురేష్ కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ రోల్స్ తోపాటు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడదు. కానీ ఈ బ్యూటీ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ చాలా ఎక్కువ. ‘మహానటి’ తర్వాత ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసిన ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరిగా ఆడలేదు. గతేడాది ఓటీటీలో రిలీజైన ‘చిన్ని’ అనే డబ్బింగ్ సినిమా హిట్ అందుకుంది. అందులో రివేంజ్ తీర్చుకునే పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది.
ఇప్పుడు ఆ మూవీకి ఏడాది పూర్తయిన తర్వాత పలు ఫొటోలు, ఓ వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ముఖంపై గాయాలతో ఉన్న ఈ మూవీలోని స్టిల్. అదంతా కూడా మేకప్ మాత్రమే. కానీ ఎంతో రియలస్టిక్ గా ఉండేసరికి కీర్తి సురేష్ గాయాలపాలైందని మాట్లాడుకుంటున్నారు. సో అదనమాట విషయం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్.. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చేస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి కీర్తి సురేష్ గాయాల ఫొటో చూడగానే మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.