ఆమె తండి స్టార్ డైరెక్టర్, అమ్మ నటి… ఇంకేముంది ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ తనకు అస్సలు సంబంధం లేని ఇండస్ట్రీలోకి ఆ బ్యూటీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీలోనే క్యూట్ గా కనిపించి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేసింది. ప్రస్తుతం యంగ్, సీనియర్ హీరోలతో కలిసి నటిస్తోంది. తనతో పాటు యాక్ట్ చేస్తున్న యంగ్ హీరోతో లవ్ లోనూ ఉన్నట్లు చాలా గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ భామ ఎవరో కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన గుండుతో కనిపిస్తున్న చిన్నారి కల్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్-నటి లిస్సీల ముద్దుల కుమార్తె. చెన్నైలో స్కూలింగ్ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత సింగపూర్ లో హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసింది. చదువుతున్న టైంలో పలు నాటకాల్లో చేసి అనుభవం సంపాదించింది. ఇక విదేశాల్లో స్టడీస్ కంప్లీట్ చేసి తిరిగొచ్చాక.. ఇక్కడ కూడా యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. అయితే నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు.. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ దగ్గర ‘క్రిష్ 3’ కోసం పనిచేసింది. విక్రమ్ ‘ఇంకొక్కడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ వర్క్ చేసింది.
ఇక అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ మూవీతో కల్యాణి, హీరోయిన్ గా పరిచయమైంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కల్యాణి బ్యూటీ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీని తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. అనంతరం పూర్తిగా తెలుగుకు దూరమై.. తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ పూర్తి బిజీగా మారిపోయింది. ఈ ఏడాది ‘హృదయం’, ‘తళ్లుమాల’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించి హిట్స్ కొట్టింది. ప్రస్తుతం మలయాళంలోనే ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఈమెకు సంబంధించిన చిన్నప్పటి పిక్ వైరల్ గా మారింది. ఇక మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో కల్యాణి లవ్ లో ఉందని టాక్ ఉంది. చిన్నప్పటి నుంచి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కావడం, కలిసి సినిమాలు చేస్తుండటం వల్లే ఈ రూమర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి కల్యాణి చైల్డ్ హుడ్ ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.