హీరోయిన్ గా 50 సినిమాలు చేసిన హన్సిక.. గతేడాది చివర్లో పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ విషయంలో కాస్త తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తగ్గేదే లే ట్రెండ్ ఫాలో అవుతోందని ఆమె తాజా ఫొటోలు చూస్తుంటే అనిపిస్తోంది.
హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో ‘దేశముదురు’లో ఫస్ట్ టైమ్ ఆమెని చూసినప్పుడే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ.. ఆమెని ఫాలో అవుతూనే ఉన్నారు. గతేడాది చివర్లో ఆమె పెళ్లి చేసుకోవడంతో చాలామంది హార్ట్ బ్రేక్ అయింది కూడా. బహుశా పెళ్లి తర్వాత మూవీస్ తగ్గిస్తుందేమో అనుకున్నారు కానీ అంతకంతకు రెచ్చిపోతూనే ఉంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే అదే అనిపిస్తుంది. బోట్ లో చిట్టి పొట్టి బట్టలతో ఈ ముద్దుగుమ్మ కనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలో పుట్టిన హన్సిక బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’ చిత్రంలో నటించింది. ఇది రిలీజైన నాలుగేళ్లకు అంటే 2007లో అల్లు అర్జున్ ‘దేశముదురు’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఏకంగా హిట్స్ కొట్టేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 15 ఏళ్లకు పైగా 50 సినిమాల్లో నటించింది. కంత్రి, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పవన్ తదితర సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చివరగా 2019లో వచ్చిన తెనాలి రామకృష్ణ LLBలో హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం తెలుగు రెండు సినిమాలు కంప్లీట్ చేసిన హన్సిక.. తమిళంలో మరో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గతేడాది డిసెంబరు 4న సొహైల్ కతురియా అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అలానే హన్సిక పెళ్లి మొత్తాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘హన్సిక లవ్ షాదీ డ్రామా’ అనే షోగా రిలీజ్ చేశారు. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు బయట కనిపించని హన్సిక.. తాజాగా ఫుల్ చిల్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె వరసగా ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. వీటిని చూసిన నెటిజన్స్.. పెళ్లి అయినా సరే హన్సిక రెచ్చిపోతూనే ఉందని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఫొటోలు చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.