చైల్డ్ ఆర్టిస్ట్ గా హిట్ సినిమాల్లో నటించిన ఈ పాప.. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీలో సూపర్ హిట్స్ అందుకుంది. ఆమె ఎవరో గుర్తొచ్చిందా?
చాలామంది అమ్మాయిలు.. కాస్త ఏజ్ వచ్చిన తర్వాత హీరోయిన్లు అవుతుంటారు. ఒకప్పుడేమో గానీ ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చి హిట్స్ కొట్టిన వాళ్లు చాలా అంటే చాలా తక్కువమంది అని చెప్పాలి. ఈ బ్యూటీ కూడా అలా టెన్త్ క్లాస్ చదువుతున్న టైంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ అయిపోయింది. మాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత 15 ఏళ్లలో 50కి పైగా మూవీస్ చేసింది. రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుని.. ఫ్యాన్స్ గుండెల్ని బ్రేక్ చేసింది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
అసలు విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి బాంబేలో పుట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ ఐదు సినిమాలు చేసింది. వీటిలో చివరి సినిమా చేసిన నాలుగేళ్లకే ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే హన్సిక మోత్వానీ. బంపర్ హిట్ తో టాలీవుడ్ లో గ్రాండ్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో చేసింది. కానీ ఎందుకో పెద్దగా లక్ కలిసి రాలేదు. దీంతో తమిళంలోకి వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కోలీవుడ్ ఫ్యాన్స్ ఈమెకు ఏకంగా గుడి కూడా కట్టేశారు.
హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్ల కెరీర్ హన్సికది. ఈ టైంలోనే 50కి పైగా సినిమాలు చేసింది. తెలుగులో చివరగా సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ llb’ మూవీ చేసింది. ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ లాంటి సినిమాల టాలీవుడ్ లో, తమిళంలో మరో మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె వ్యక్తిగత విషయానికొస్తే.. గతేడాది చివర్లో సొహైల్ కతురియా అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ అయినా సరే గ్లామర్ చూపించే విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే అదే అనిపిస్తోంది.