ఆమె పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. స్టార్ హీరోయిన్ల పోటీ ఇచ్చే రేంజులో ఫిజిక్ ఆమె సొంతం. ఔట్ ఫిట్ ఏదైనా సరే ఆమె అందాన్ని దాచడం కాస్త కష్టమే. మరి ఈ బ్యూటీని ఎవరో గుర్తుపట్టారా?
ఆమె అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పిల్ల. స్వర్గంలో అప్సరసలు కూడా ఈమెని చూస్తే అసూయ పడతారు. రంభ-ఊర్వశి-మేనక సైతం.. ఈమె ఫిజిక్ చూసి కుళ్లుకుంటారు. చిన్నమ్మాయిలా ఉంది కానీ గ్లామర్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఉందని మెంటలెక్కిపోతారు. ఫస్ట్ సినిమాతోనే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయిన ఈ బ్యూటీ.. స్టార్స్ తో కలిసి నటించింది. కాకపోతే కెరీర్ లో తప్పటడుగులు వేస్తూనే ఉంది. పెద్దగా మూవీస్ చేయట్లేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం తన ఒంపుసొంపులతో అందాల విందు ఇస్తూనే ఉంటుంది. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మంలో పుట్టిన ఈమె.. తొలుత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ లోనూ యాక్ట్ చేసింది. అలా ‘మల్లేశం’లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. హిట్ కూడా కొట్టేసింది. ఆమెనే అనన్య నాగళ్ల. ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాతో ఆకట్టుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించింది. ఆ తర్వాత మాత్రం ‘మ్యాస్ట్రో’, ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాల్లో చాలా చిన్న చిన్న పాత్రలు చేసింది. సమంత ‘శాకుంతలం’లో ఈమె ఓ క్యారెక్టర్ లో నటించింది. వచ్చే నెలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్న హీరోయిన్ అనన్య నాగళ్ల కెరీర్ ఏ మాత్రం ఎఫెక్టివ్ గా అయితే లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగుతోంది. అయితే ఈమెకి ఇన్ స్టాలో మాత్రం మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లని ఎంటర్ టైన్ చేసే విషయంలో మాత్రం అనన్య అస్సలు డిసప్పాయింట్ చేయదు. నవ్వుతూ పోజిలిస్తూనే కొరుక్కు తినేయాలి అనేంతగా హాట్ పోజులతో రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ మధ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది కానీ లేకపోతే మాత్రం అనన్య అందాల తాకిడి తట్టుకోవడం చాలా కష్టం. సరే ఇదంతా పక్కనబెడితే.. చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.