ఈమె తెలుగులోనూ సినిమాలు చేసిన హీరోయిన్. చూడటానికి ఇంగ్లీష్ బొమ్మలా క్యూట్ గా ఉంటుంది. జాకీచాన్ తో సినిమా చేసిన ఘతన ఈమెకే దక్కుతుంది. ఎవరో గుర్తుపట్టారా?
సాధారణంగా హీరోయిన్లని చూడగానే అరే భలే ఉన్నార్రా అనిపించాలి. కొందరిని చూస్తుంటే సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది. పైన కనిపిస్తున్న పాప కూడా సేమ్ ఆ కేటగిరీకి చెందినదే. పుట్టి పెరిగింది ముంబయిలో అయినా ఇంగ్లీష్ పిల్లలా కనిపిస్తుంది. ఏ హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా జాకీచాన్ తో ఓ ఇంటర్నేషనల్ మూవీలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, తమిళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వస్తే.. ఈ బ్యూటీ ఇప్పటివరకు 12కి పైగా సినిమాలు చేసింది గానీ పెద్దగా హిట్స్ అయితే కొట్టలేకపోయింది. యాక్టింగ్ లో అంతంత మాత్రం మేనేజ్ చేస్తుంటుంది గానీ గ్లామర్ విషయంలో అస్సలు తగ్గదనే చెప్పాలి. ఆ ఒంపుసొంపులు ఉంటాయి మాస్టారూ ‘కేకస్య.. కేకభ్యోహ’ అంతే. ఇలాంటి ఈమె.. ధనుష్, సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్, రాజ్ కుమార్ రావ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. అయినా సరే ఈమెని లక్ వరించలేదు. అయినా సరే పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. సినిమాలు చేస్తోంది.
ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ కెరీర్ లో లక్కీయెస్ట్ మూమెంట్ ఏంటంటే.. 2017లో జాకీచాన్ హీరోగా వచ్చిన ‘కుంగ్ ఫూ యోగా’ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. ఇలా ఓ ఇంటర్నేషనల్ మూవీలో నటించినా ఈమె కెరీర్ కి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మహేష్ బాబు చెల్లెలు మంజుల డైరెక్ట్ చేసిన ‘మనసుకు నచ్చింది’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘రాజుగాడు’ అనే మరో మూవీలోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమెని పట్టించుకునేవాడు లేకుండా పోయాడు. సో అదనమాట విషయం. మరి ఈమె చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.