ఆమెని చూడగానే అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నవ్వితే నవరత్నాలు రాలిపోతాయేమో అనిపించేలా ఉంది అని ఫ్యాన్స్ కనీసం ఒక్కసారైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ బ్యూటీ అంతా బాగుంటుంది కాబట్టి. ఇక మోడ్రన్ డ్రస్ వేసినా, చీరకట్టినా.. అందం విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదు. మొన్నటివరకు తమిళ సినిమాలు చేసినా ఈ భామ.. తెలుగు డైరెక్టర్ తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అమృత అయ్యర్. బెంగళూరులో తమిళ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన ఈమె డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అలా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో లింగ, పోలీసోడు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులోనూ హీరోయిన్ గా అవకాశాలు వచ్చిపడ్డాయి.
అలా డబ్బింగ్ సినిమా ‘విజిల్’ తర్వాత రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, అర్జున ఫాల్గుణ లాంటి తెలుగు మూవీస్ చేసింది. ఇవేవి కూడా హిట్ కానప్పటికీ.. అమృత బ్యూటీకి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు తమిళంలోనూ హీరోయిన్ గా లిఫ్ట్, కాఫీ విత్ కాదల్ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తీస్తున్న ‘హనుమాన్’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇది పాన్ ఇండియా మూవీగా థియేటర్లలోకి తీసుకురానున్నాడు. ఒకవేళ ఇది గనక హిట్ అయితే అమృత.. ఓవరాల్ ఇండియా పాపులర్ కావడం గ్యారంటీ. సరే ఇదంతా పక్కనబెడితే చిన్నప్పటి అమృత అయ్యర్ ని మీలో ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.