ఈ మద్య టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మాద్యమాలతో సినీ సెలబ్రెటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెంచేసుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు సెలబ్రెటీలకు తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఎవరో తమ అకౌంట్స్ హ్యాక్ చేయడం.. తర్వాత మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం చూస్తూనే ఉన్నాం.
టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, హీరో రామ్ నటించిన ‘రెడ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మందలించింది. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన.. అర్జున ఫల్గుణ సినిమాలోనూ అమృతా అయ్యర్ నటించింది. తాజాగా హీరోయిన్ అమృత అయ్యర్ కు ఊహించని షాక్ తగిలింది.
హీరోయిన్ అమృత అయ్యర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రస్తుతానికైతే తన అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టలేదని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీనిపై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది అమృత.
Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon .
— Amritha (@Actor_Amritha) February 1, 2022