కొందరు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంటారు. అలాంటివారిలో చాలామంది బ్యూటీస్ ఉన్నారు. ఈ లిస్ట్ చెప్పుకోవాల్సిన పేరు హీరోయిన్ అమీషా పటేల్. ‘బద్రి’తో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పటికే అంతే అందంగా, అంతే హాట్ గా ఉంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే మీకే ఈ విషయం సులభంగా అర్ధమైపోతుంది. ఇక అమీషా పోస్ట్ చేసే ఫొటోలు.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ఇప్పటికీ సింగిల్ గానే ఉన్న ఆమె.. పాక్ నటుడితో ప్రేమలో ఉందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజమెంత?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీషా పటేల్, పవన్ కల్యాణ్ ‘బద్రి’ మూవీతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంటరైంది. ఆ తర్వాత మహేశ్ బాబు ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమవీరచక్ర’ తదితర తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే టాలీవుడ్ కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ కాన్సట్రేషన్ చేసిన ఈ భామ… కెరీర్ లో చాలా వరకు హిందీలోనే సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలు ఎప్పుడూ కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి.
హీరోయిన్ అమీషా తాజాగా.. పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో క్లోజ్ గా ఉన్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టకొచ్చాయి. వీటిపై స్పందించిన అమీషా.. వాటిని కొట్టిపారేసింది. ‘ఇమ్రాన్ అబ్బాస్ నాకు చాలాకాలం నుంచి తెలుసు. యూఎస్ లో చదువుతున్నప్పుడు పరిచయం. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లం. ఈ మధ్య అతడిని కలిశాను. ఆ సమయంలో సరదాగా ఓ ఇన్ స్టా రీల్ చేశాం. చూడటానికి బాగుందని పోస్ట్ చేశాను. ఇది వైరల్ కావడంతో దీన్ని చూసిన వారు.. నేను తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. వాటిని విని నేను బాగా నవ్వుకుంటున్నాను’ అని అమీషా చెప్పింది. ఇదిలా ఉండగా.. తాజాగా బహ్రెయిన్ వెళ్లిన అమీషా.. ఇమ్రాన్, మిగతా ఫ్రెండ్స్ తో సరదాగా గడిపారు. ఇందులో భాగంగా ఓ ప్రేమపాటకు అమీషా-ఇమ్రాన్ వీడియో చేశారు. మరి అమీషా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.