స్టార్ హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అమీషా పటేల్ పేరు చెప్పగానే.. ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చేమో గానీ 90స్ కిడ్స్ అడిగితే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’లో నటించింది ఈ బ్యూటీనే కాబట్టి. ఆ తర్వాత కూడా మహేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసింది కానీ హిట్స్ అయితే కొట్టలేకపోయింది. దీంతో బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయి అక్కడే సెటిలైపోయింది. ప్రస్తుతం హిందీ పంజాబీ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. అలాంటి ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ హీరోయిన్ అమీషా పటేల్.. ఏ కేసులో ఇన్వాల్వ్ అయింది? ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తన ‘దేశీ మ్యూజిక్’ సినిమాలో పెట్టుబడుల కోసం రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే ఇన్వెస్టర్ ని అమీషా పటేల్ సంప్రదించింది. దీంతో అతడు రూ.2.5 కోట్లు ఈమె అకౌంట్ కి ట్రాన్సఫర్ చేశాడు. మేకింగ్, ప్రమోషన్స్ కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టాలని ఇతడు కోరాడు. 2013లో ఈ మూవీ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో అజయ్.. తన డబ్బు తిరిగిచ్చేయాలని ఈమెని చాలాసార్లు కోరాడు. 2018 అక్టోబరులో రూ.2.5 కోట్లు, రూ.50 లక్షలకు రెండు చెక్స్ ని అతడికి ఇచ్చింది. కానీ ఈ రెండు కూడా బౌన్స్ అయ్యాయి.
ఈ క్రమంలోనే హీరోయిన్ అమీషా పటేల్ తోపాటు ఆమె బిజినెస్ పార్టనర్ కృనాల్ పై రాంచీ సివిల్ కోర్టులో అజయ్ కేసు వేశాడు. తాజాగా విచారణకు అమీషా హాజరు కాగా, ఆమె తరఫు న్యాయవాది మాత్రం రాలేదు. దీంతో ఈ కేసుని ఏప్రిల్ 15కు కోర్టు వాయిదా వేసింది. గతంలో రూ.32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం.. అమీషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 420, 120 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. ఇదంతా చూస్తుంటే ఆమె త్వరలో అరెస్ట్ సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్స్ జారీ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.