ఈమె స్టార్ హీరోయిన్. ఇప్పటివరకు పలు సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడే ఒకే మూవీతో కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది.
ఈమె తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య ఎందుకో కాస్త డల్ అయినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు సడన్ గా ఓ సినిమాతో ఆలోవర్ కంట్రీ.. తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎక్కడ చూడు ఇదే మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈమె కేవలం హీరోయిన్ గానే కాదు ఓ ప్రాచీన యుద్ధవిద్యలోనూ ఎక్స్ పెర్ట్. మరి ఇంతలా చెబుతున్నాం కదా ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి, ముంబయిలో పుట్టి పెరిగింది. తండ్రి తమిళ, అమ్మ మలయాళీ కావడంతో దక్షిణాది మూలాలు ఉన్నాయి. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. మల్లకంబు అనే విద్యలోనూ ప్రావీణ్యం సంపాదించుకుంది. 2008లో ‘1920’ మూవీతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ పేరు అదాశర్మ. 2014లో పూరీ జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి దాదాపు సౌత్ లోనే మూవీస్ చేస్తూ సెటిలైపోయింది.
గత మూడేళ్లుగా హిందీలో నటస్తూ కాస్త బిజీగా ఉన్న అదాశర్మ.. తాజాగా ‘ద కేరళ స్టోరీ’ అనే సినిమా చేసింది. దక్షిణాది భాషల్లో మే 5న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది. ఎందుకంటే ఈ మూవీ.. లవ్ జిహాద్ కాన్సెప్ట్ తో తీశారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలకు కారణమవుతోంది. చిత్రబృందం ఏమో సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉంది. పొలిటికల్ పార్టీలేమో విమర్శలు చేసుకుంటున్నాయి. దీని కారణంగా ఇప్పుడు అదాశర్మ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.