తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఛలో’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మికా మందన. ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీతా గోవిందం’ సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆమె చేతి నిండా ఆఫర్స్ తో ఫుల్ బిజీ కెరీర్ గడుపుతోంది. రష్మిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా రష్మికా మందన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వర్యంలో రష్మిక పలు పూజలు చేసినట్లు ఫొటోలు, వీడియోను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ పూజలను ఆమె ఎందుకు చేయించిందో అర్థం కావడం లేదు. ఆమె పూజలు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె చేత పూజలు నిర్వహిస్తుంది వేణు స్వామి కావడంతో ఆ వీడియో సంచలనంగా మారింది. గతంలో సమంత, చైతన్యలు విడిపోతారని వేణు స్వామి చెప్పారు. అలాగే కొన్ని విషయాల్లోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి.
ఇది కూడా చదవండి : వైసీపీ నేతలపై హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల రకుల్ తన ప్రియుడు జక్కీ భగ్నానీ గురించి రివీల్ చేశారు. రకుల్-జక్కీ జాతకాలు చూసిన ఆయన.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతక రీత్యా జక్కీని రకుల్ వివాహం చేసుకుంటే ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, జైలుపాలు కూడా కావచ్చని తెలిపారు. అలాగే చంద్రబాబు మరలా ఓడిపోతారని, సీఎం జగన్ మరో 15 ఏళ్ళు పాలిస్తాడని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఇంట్లో పూజల విషయంపై రష్మిక ఇప్పటివరకు నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా వేణు స్వామితో రష్మీ పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.