కన్నడ స్టార్ హీరో యష్ “కేజీఎఫ్” సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించాడు. భాషలతో సంబంధం లేకుండా యష్ కు అభిమానులు పెరిగిపోయారు. కె.జి.ఎఫ్-2 సినిమాకు సంబంధించిన పనులతో యష్ బిజీగా ఉన్నాడు.
ఇలాంటి బిజీ సమయంలో ఉంటూ కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటాడు. తాజాగా యష్ తన కూతురికి తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాడు. యష్ చెప్తుంటే తన కూతురు ఆర్య ముద్దుముద్దుగా తెలుగు అక్షరాలు పలుకుతోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.