హీరో విశాల్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల తర్వాత కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. హీరో విశాల్, ఆర్య నటింటిన కొత్త చిత్రం ‘ఎనిమీ’ . ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కించగా, వినోద్ కూమార్ నిర్మించారు. మృణాళిని, మమత మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిన సారాంశంతో తెరకెక్కిన చిత్రమే ఎనిమి. దీపావళికి తను నటించిన ‘ఎనిమీ’ చిత్రం విడుదలవుతుందని విశాల్ తెలిపారు.
మరణం అందరికి వస్తుంది కొందరి మరణం అందరినీ బాధిస్తుంది. అలాంటి మరణమే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కూమార్ ది. ఎందరో పేదల జీవితాలకు చేయూత ఇచ్చిన పునీత్.. తను మాత్రం కొందరి చేయిని మధ్యలోనే వదిలేయడం దారుణం. ఇది చాలా మంది కథానాయకుల వేదన. వారిలో తమిళ్ హీరో విశాల్ ఒకరు. ‘కన్నడ హీరో పునీత్ రాజ్ కూమార్ మరణం చాలా బాధించింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉంది. ఆయన చేపట్టిన అనేక మంచి పనుల్లో ఒకటైనా చెయ్యాలి అనుకున్నా. పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యత నాది. వారి విద్యకు సంబంధించిన ప్రతిది నేను చూసుకుంటాను’ అని విశాల్ తెలిపారు. హీరో విశాల్ చెప్పిన వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.