సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు అంటే రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి స్టంట్స్ హీరోకి బదులు డూప్ తో చేయిస్తుంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం స్వయంగా రిస్క్ తీసుకొని ఆ సన్నివేశాల్లో పాల్గొంటారు. అలాంటి సమయంలో వారికి గాయాలు కావడం ఎన్నో చూశాం. తాజాగా యాక్షన్ హీరో విశాల్ “లాఠీ” సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ సినిమా షూటింగ్ ఆపేసి.. ఆయన హుటాహుటిన చికిత్స కోసం కేరళ వెళ్లారు. ఆయన కేరళలో చికిత్స చేయించుకుని కొన్నిరోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
‘తాను విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నానని ఆయన తన పోస్టులో తెలిపారు. మళ్లీ మార్చి మొదటి వారంలో లాటీ సినిమా తుది దశ షెడ్యూల్‌లో పాల్గొంటానంటూ’ ఆయన తన పోస్టులో వివరించారు. ఇక .వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, అతడి సరసన సునయన హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Suffered multiple hairline fractures during the filming of this stunt sequence in #Laththi.
Off to #Kerala to rejuvenate myself!Will join the crew for the final schedule from March first week 2022. GB. pic.twitter.com/L1pOByb6hZ
— Vishal (@VishalKOfficial) February 11, 2022