ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, అయితే ఓటు మాత్రం వైఎస్ జగన్ కే వేస్తానని విశాల్ అన్నారు. విశాల్ హీరోగా.. ఎ. వినోద్ కుమార్ తెరకెక్కించిన లాఠీ చిత్రం.. ఈ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. సోమవారం.. తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్‌డీహెచ్‌ఆర్ కాలేజీల్లో.. రెండు వేర్వేరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈసందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో విశాల్, సునాయన జంటగా నటించిన సినిమా ‘లాఠీ’. ఈ సినిమాను రాణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద నిర్మించారు. ఈనెల 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం.. తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్‌డీహెచ్‌ఆర్ కాలేజీల్లో.. రెండు వేర్వేరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇక ఎస్‌డీహెచ్‌ఆర్ కాలేజీలో నిర్వహించిన వేడుకకు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమం అనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు. మీడియాతో విశాల్ మాట్లాడుతూ… ‘ నాకు పవన కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన హీరో కాక ముందే చిరంజీవి హీరోగా నటించిన ఎస్పీ పరశురామ్ సినిమా నుంచే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమానం. అయితే రాజకీయాల విషయానికి వస్తే.. నేను జగనన్నకే ఓటు వేస్తాను. నాకు వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ అంటే ఇష్టం అనే మాట నా గుండెల్లో నుంచి వస్తుంది. నేను ఓటు వేయాల్సి వస్తే.. జగన్ కు తప్ప మరెవరికీ వేయను. అయితే నేను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’ అని విశాల్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి. విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ఇష్టం.. రాజకీయంగా జగనన్న నాకు ప్రాణం ఆయనకే ఓటు వేస్తాను – హీరో విశాల్🔥 pic.twitter.com/emRFNFHesO
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 20, 2022