తనని బతికుండగానే చంపేశారని, ఆ బాధ తట్టుకోలేక ఐదురోజులు ఐసీయూలోనే ఉన్నానని హీరో విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. ఇంతకీ విక్రమ్ విషయంలో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. చియాన్ విక్రమ్ అంటే తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. శివపుత్రుడు, అపరిచుతుడు లాంటి మూవీస్ తో అప్పట్లోనే తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు విక్రమ్. ఆ క్రమంలో ప్రశంసలు వచ్చాయి గానీ హిట్స్ మాత్రం తగ్గిపోయాయి. గత కొన్నేళ్లలో ఐ లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసిన విక్రమ్.. ఇప్పుడు కోబ్రా లాంటి మరో ఎక్స్ పెరిమెంట్ మూవీతో వస్తున్నాడు. ఇందులో దాదాపు పది పాత్రల్లో నటించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన విక్రమ్.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
“మా నాన్న హెడ్ మాస్టర్. ఆయన నటుడు కావాలని చెన్నై వచ్చారు. నేను మూడేళ్లకే ఓ చిత్రంలో పాపగా నటించాను. నాకు నటన అంటే పిచ్చి. అలా కోబ్రా కథ వినగానే చేయాలనిపించింది. కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైంది. రష్యాలో మైనస్ 40 డిగ్రీల చలిలో కూడా ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. ఈ చిత్రంలో పది పాత్రలు చేశాను. ఒక్కో దాని మేకప్ కోసం ఐదారు గంటలు పట్టేది. ఇకపోతే ఈ సినిమా ఛాలెంజింగ్ గా అనిపించింది. నాకు తెలిసింది నటనే. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు ఎప్పుడు కొత్త అనుభూతి పంచాలని, భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను” అన్నారు విక్రమ్.
ఇంకా మాట్లాడుతూ.. “ఈ మధ్య ఒంట్లో బాగాలేక ఆస్పత్రిలో ఉన్నాను. దీంతో నా ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. మరికొందరైతే ఏకంగా నా ఫొటోకి దండేసి, ఫ్రేమ్స్ పెట్టి, నేను లేనట్లు ప్రచారం చేశారు. ఇవన్నీ చూసిన నాకు చాలా బాధేసింది. దీంతో ఐదురోజులపాటు ఐసీయూలోనే ఉన్నాను” అని విక్రమ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విక్రమ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా సైకలాజికల్ సైన్స్ పిక్షన్ డ్రామాగా తెరకెక్కిన కోబ్రా సినిమాలో విక్రమ్ కి జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో కీలకమైన రోల్ చేశారు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. ఈ సినిమాకు డిమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఆగస్టు 31న పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది. మరి విక్రమ్ మాటల గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.