హీరో విజయ్ సర్కార్, ఏజెంట్ బైరవ, పోలీస్, జిల్లా, పులి, విజిల్ ఇలా చెప్పుకుంటూ పోతే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విజయ్ ఓ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చి తన ఉన్నతమైన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
తళపతి విజయ్ తమిళ హీరో. తను చేసిన పనులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు టాప్‌లో ఉంటాయి. తమిళంలోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే కెపాసిటీ ఉన్న హీరో విజయ్. అప్పుడప్పుడు తన అభిమానులకు తను ఇచ్చే సందేశాలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. హీరో విజయ్ సర్కార్, ఏజెంట్ బైరవ, పోలీస్, జిల్లా, పులి, విజిల్ ఇలా చెప్పుకుంటూ పోతే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విజయ్ ఓ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చి తన ఉన్నతమైన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆపాప ఎవరు? నటుడు విజయ్ ఎందుకు ఇచ్చాడనే వివరాలు తెలుసుకుందాం..
ఇటీవల తమిళనాడులో పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ‘విజయ్ పీపుల్స్ మూమెంట్’లో ఓ ఈవెంట్ జరిగింది. ఫలితాల్లో టాప్-3లో నిలిచిన విద్యార్థులను హీరో విజయ్ సన్మానించారు. వారికి గిఫ్ట్‌లు కూడా ఇచ్చాడు. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన 12వ తరగతి రిజల్ట్స్‌లో ఒక అమ్మాయి ఎక్కువ మార్కులు తెచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ అమ్మాయికి వచ్చిన మార్కులు ఎన్నో తెలుసా? 600 మార్కులకి 600 మార్కులు సాధించింది. చదువులో ఆ అమ్మాయి ఆశ్చర్యపరిచేలా మార్కులు తెచ్చుకుంది. చదువులో అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన అమ్మాయికి ప్రోత్సాహకంగా హీరో విజయ్ డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుత రాజకీయాలపై మన కోలీవుడ్ హీరో విజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్పందించారు. మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. ఓట్లను డబ్బులకు అమ్ముకోవద్దని స్టూడెంట్స్‌కి చెప్పారు. రేపటి పౌరులు.. రేపటి ఓటర్లు.. భవిష్యత్ నాయకులు కూడా మీరే అని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. రేపటి భవిష్యత్ కూడా మీ చేతులోనే ఉందని తెలిపారు.