దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేకం. ఇక్కడ సినిమా వాళ్లు ఎక్కువ కాలం సీఎంలుగా పాలించారు. కారణం తమిళనాట సినిమావాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీ చెందిన కరణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. అనంతరం వీరితో పాటు విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు సైతం రాజకీయ పార్టీలను పెట్టి రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయ ఎంట్రీ ఉహగానులు వచ్చాయి. కానీ తాను రాజకీయలకు దూరం అంటూ రజనీ తెలిపారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..
ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే వీళ్లందరూ “కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్” కింద పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూమెంట్ ఏ పార్టీతో ఏలాంటి పొత్తు లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని విజయ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు. తన అభిమానులు స్వతంత్రం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని.. వాళ్లకు మనస్ఫూర్తిగా ప్రచారం నిర్వహించాలని, ప్రచారంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు. మరి తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.