టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు… తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నేళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి. అనంతరం చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా రవితేజ హీరోగా వస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో వేణు ఫుల బిజీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వూలో పాల్గొన్న వేణు.. సునీల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వేణు, సునీల్.. ఇద్దరు కలసి కొన్ని సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి పండించిన కామెడీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన “చెప్పవే చిరుగాలి” సినిమా సూపర్ హీట్ అయింది. ఇందులో సునీల్, వేణు పండించిన కామెడీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలానే వారిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఈక్రమంలో సునీల్ హీరోగా, విలన్ పాత్రల్లో నడిస్తూ మంచి క్రేజ్ సంపాందించుకున్నారు. అలా సునీల్ సినిమాలతో ఫుల్ బిజీ కాగా వేణు మాత్రం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో వేణు దాదాపు 9 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక ఇన్నేళ్లకు మళ్లీ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వూల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో సునీల్ పై వేణు ఆసక్తిక కామెంట్స్ చేశారు. ఇంటర్వూల్లో వేణు మాట్లాడుతూ…”నాకు ఒకప్పటి సునీల్ అంటే ఇష్టం ఉండేది. కానీ ఇప్పటి సునీల్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే పాత సునీల్ అయితే మాములుగా మాట్లాడిన అందరు నవ్వుతారు. కానీ ఇప్పుటి సునీల్.. విలన్ గా అంటే నటించాలి. ఏది ఏమైనప్పటికి సునీల్ అనేక విభిన్నమైన పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి నటించిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమా మరిచిపోలేనిది” అంటూ సునీల్ పై తనకున్న అభిమానాన్ని వేణు షేర్ చేసుకున్నారు. మరి.. సునీల్ పై వేణు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.