‘వెంకట్’ సీతారాముల కల్యాణం చూదమురారండి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమయ్యాడు. ఆ తర్వాత మెగాస్టార్ తో అన్నయ్య సినిమా చేసి టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. 1998 నుంచి 2014 వరకు యాక్టివ్ గానే ఉన్నా ఆ తర్వాత వెంకట్ స్క్రీన్ పై కనిపించలేదు. మళ్లీ ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయాడు. తాజాగా వెంకట్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు.
సీతారాముల కల్యాణం చూదమురారండి సినిమా హిట్ అయినా కూడా తనకు అన్నయ్య సినిమాతో ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాడు. అంతేకాదు సీతారాముల కల్యాణం సినిమా సమయంలో జరిగిన ఓ ఘటన గురించి కూడా గుర్తు చేసుకున్నాడు. ‘షూటింగ్ జరుగుతోంది.. అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను చెంపదెబ్బ కొట్టే షాట్ అది. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత వచ్చి చూసుకుంటే చెంప మొత్తం ఎర్రగా అయ్యింది’ అంటూ వెంకట్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.