తమిళ స్టార్ హీరో సూర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. ఎంతో సింపుల్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సఖి చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ రాకెట్రీ అనే బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సెట్ లో మాధవన్ గెటప్ చూసి హీరో సూర్య ఒక్కసారే షాక్ తిన్నాడు.. దీనికి సంబంధించిన వీడియో మాధవన్ షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు తెకకెక్కించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కి సంబంధించిన బయోపిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. నంబి నారాయణ పాత్రలో మాధవన్ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో సూర్య నటిస్తున్నాడు. ఈ మూవీ మాధవన్ స్వయంగా నిర్మిస్తూ.. దర్శకత్వం వహించాడు. ఈ పాత్ర కోసం మాధవన్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది. తెల్ల జుట్టు.. కాస్త కళ్లద్దాలతో లావుగా కనిపిస్తున్నాడు మాధవన్. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు మాధవన్.
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో షూటింగ్ స్పాట్ లో నంబి నారాయణన్‌తో మాధవన్ కలిసి మాట్లాడుతున్నాడు. అంతలోనే షూటింగ్ లోకేషన్ కి హీరో సూర్య ఎంట్రీ ఇచ్చాడు. నంబి నారాయణన్ వేషధారణలో ఉన్నటువంటి మాధవన్ ని చూసి సూర్య ఒక్కసారే షాక్ అయ్యాడు. కొద్ది సేపు అలాగే మాధవన్ ని చూస్తుండిపోయాడు. నీ గెటప్ సూపర్ బ్రదర్ అంటూ దండం పెట్టాడు. ఈ సందర్బంగా సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు మాధవన్.
ఈ సందర్బంగా సూర్యతో నంబియార్ మాట్లాడుతూ.. మీ తండ్రి మంచి దర్శకుడు, నటులు అని పొగిడారు. అలాగే సూర్య నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. నంబియార్ మాటలకు ఎంతో సంతోషించిన సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మూవీలో సిమ్రాన్ నటించింది. ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.