శ్రీకాంత్ కుమారిడిగానే కాకుండా రోషన్ తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తాజాగా పెళ్లిసందD హిట్ కావడంతో అతని గుర్తింపు మరో స్థాయికి చేరింది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో వెండితెరకు పరిచయమైన రోషన్ అప్పటినుంచే నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారు సైతం అతని టాలెంట్‌ను మెచ్చుకోవడంతో అతని గుర్తింపు రెట్టింపైంది. ఇప్పుడు అందరూ రోషన్ గురించే వెతుకులాట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గతంలో రోషన్ చేసిన ప్రాజెక్టులు కూడా బయటకు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుకున్న ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రోషన్ హీరోగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ గతంలో రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశాడు. అది ఏదో చిన్నాచితక సినిమాకి కాదు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ప్రభుదేవా డైరెక్షన్‌లో 2019లో విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం ‘దబాంగ్ 3’కి రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన న్యాచురల్ స్టార్ నాని ఎలా అయితే హీరోగా క్లిక్ అయ్యాడో.. రోషన్ కూడా అలాగే క్లిక్ అవుతాడంటూ శ్రీకాంత్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రోషన్ దబాంగ్ 3కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించే సమయంలో అక్కడి తారలు, సిబ్బంది అతని పనిని చాలా మెచ్చుకునేవారు. అతను ఏ పని అయినా చాలా అంకితభావంతో చేస్తాడని కితాబిచ్చారు. అంతేకాదు హీరో మెటీరియల్ కాబట్టి మొదటి నుంచి రోషన్ ఎంతో స్టైల్‌గా ఉండేవాడు. అందులోనూ ఫేస్ ఫీచర్స్ హృతిక్ రోషన్‌ను పోలి ఉంటాయి. హార్డ్‌వర్క్, అందం, నటన, పేరు అన్నీ కలిసే సరకి బాలీవుడ్‌లో అందరూ రోషన్‌ను హృతిక్ రోషన్‌తో పోల్చేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వెతుకులాట మొదలవ్వగానే పాత విషయాలు అన్నీ వైరలవుతున్నాయి.