కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మొత్తం దక్షిణాది సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టింది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో డబ్ అయ్యింది రెండు మూడు సినిమాలే అయినా కూడా పునీత్‌కు మంచి అభిమానులు ఉన్నారు. తెలుగు అగ్రతారలు సైతం పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులర్పించారు. శ్రీకాంత్ కూడా బెంగళూరులో పునీత్‌కు నివాళులర్పించారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేయడం వల్లే చనిపోయారంటూ వస్తున్న వాదనలను శ్రీకాంత్ ఖండించారు. పునీత్ ఎందుకు చనిపోయారనే విషయాన్ని వెల్లడించాడు శ్రీకాంత్.
పునీత్ రాజ్ కుమార్‌తో కలిసి శ్రీకాంత్ జేమ్స్ అనే సినిమాలో నటించాడు. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు నిర్మాణ దశలోనే ఉంది. ‘ పునీత్ లేడనే మాటను నమ్మలేకపోతున్నాను. పునీత్ కుటుంబంతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. అతను స్టార్ హీరో కొడుకు అని.. అతను కన్నడ పవర్ స్టార్ అనే గర్వం అసలు లేదు. సుమారు 40 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. పునీత్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది తెలుసు. చిన్ననాటి స్నేహితుల్ని ఎవర్నీ వదలకుండా పునీత్ వాళ్లకీ హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యాడు.
‘అసలు పునీత్ రాజ్ కుమార్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. జ్వరం రావడం కూడా తెలియదని పునీత్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నిజానికి చాలామంది జిమ్ చేస్తూ చనిపోయాడని అంటున్నారు. టీవీల్లోనూ అదే వచ్చింది. అసలు అది నిజం కాదు. ముందురోజు రాత్రి నుంచే పునీత్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయాన్నే లేచి కూర్చున్న తరువాత అనీజాగా ఉందని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. జిమ్ చేయడం వల్లే ఆయన చనిపోయాడనేది నిజం కాదు. జిమ్ చేస్తూ పడిపోలేదు.. అసలు ఆయన జిమ్‌కి వెళ్లలేదు. ముందు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు.. ఆ తరువాత విక్రమ్ హాస్పటల్‌కి షిఫ్ట్ చేశారు. పునీత్ హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.