Hero Srikanth Daughter Medha Spotted At Tirumala: హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలో మరోసారి విలన్‌గా మారి ప్రేక్షకులను భయపెట్టాడు. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీకాంత్ అలనాటి అందాల నటి ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లి.. వెంటకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరలయ్యాయి.
ఇక వీటిల్లో శ్రీకాంత్ కుమార్తె మేధ అందరిని ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించి.. తల్లితో పాటు కలిసి తిరుగుతున్న మేధ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇక సంప్రదాయ దుస్తుల్లో ముద్ద మందారంలా ఉన్న మేధను చూసి.. అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్లకు తీసిపోని విధంగా ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Daddy Movie Child Artist: చిరంజీవి “డాడీ” సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ!