Sri Vishnu: ప్రముఖ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందట. ప్లేట్ లేట్స్ బాగా పడిపోయాయని సమాచారం. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని సమాచారం. శ్రీ విష్ణు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ విష్ణు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా, శ్రీ విష్ణు 2009లో వచ్చిన బాణం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. పలు సినిమాల్లో సెకండ్ లీడ్, ఫ్రెండ్ రోల్స్, సైడ్ క్యారెక్టర్‌గా చేశారు. అప్పట్లో ఒకడుండే వాడుతో హీరోగా పరిచయం అయ్యారు. విలక్షణమైన నటనతో అభిరుచి ఉన్న నటుడిగా తన కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు.
అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా, రాజా రాజా చోర వంటి సినిమాల్లో నటనతో అందరి మన్నలను పొందారు. ఇక, ఆయన హీరోగా నటించిన తాజా క్రైం థ్రిల్లర్ సినిమా ‘భళా తందనాన’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. శ్రీ విష్ణు ఇప్పటివరకు పాతికకుపైగా సినిమాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : Sudigali Sudheer: జబర్దస్త్‌లోకి సుధీర్ రీ ఎంట్రీ అంటూ వార్తలు! అసలు నిజం?