టాలీవుడ్ యంగ్ హీరో ‘సందీప్ కిషన్’కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కామెడీ టైమింగ్, తన హీరోయిజంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గల్లీరౌడీతో రీసెంట్ హిట్ కొట్టిన సందీప్.. ఇప్పుడు ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. అది కూడా బీ టౌన్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ భామ సోనియారాధీతో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ప్రేమ వార్తలో సందీప్- సోనియా ఇంకా స్పందించలేదు.
సోనియా ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే వెబ్ సిరీస్ లో నటించంది. ‘తారా వర్సెస్ బిలాల్’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది. సోనియా గతంలో ప్రొడక్షన్ డిజైనర్ గానూ పనిచేసింది. ఆమె మంచి డ్యాన్సర్ కూడా. సందీప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ‘మైఖెల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సందీప్- సోనియా ప్రేమ విషయం ఎంత వరకు నిజం? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.