ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం మీగత షోలకు పోటీ ఇస్తూ.. మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. ప్రతివారం ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. ఈ వారం ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. డ్రీమ్ బాయ్‌గా ప్రేక్షకులు మదిలో స్థానం సంపాదించుకున్న హీరో రోహిత్‌ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆదివారం ఏప్రిల్ 17న ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోలో రోహిత్ కనిపించి ప్రేక్షకులకు చిన్నపాటి షాకిచ్చారు.
ఇది కూడా చదవండి: మొట్టమొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్న Jr.NTR?
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన రోహిత్.. వస్తూనే సుధీర్‌పై రెండు పంచులు వేశాడు. ఆ తర్వాత పొట్టి నరేష్, రోహిత్ సినిమా జానకి వెడ్స్ శ్రీరామ్ స్పూఫ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ప్రోమో వీడియో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: RRRలో రామ్ చరణ్ డామినేషన్ పై స్పందించిన రాజమౌళి!ఇక 2001లో వచ్చిన 6టీన్స్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రోహిత్‌కి బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం జానకి వెడ్స్ శ్రీరామ్. ఆ తర్వాత రోహిత్ సొంతం, గర్ల్ ఫ్రెండ్, శ్రీరామ్, నవ వసంతం, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన రోహిత్ 2021లో వచ్చిన కళాకార్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి గెస్ట్‌గా రావడంతో రోహిత్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి