సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా కాంతార మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. కన్నడ నాట దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రూ.350 కోట్ల మైలురాయిని దాటింది. కన్నడ నాట ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం డివోషనల్ కి సంబంధించి సెంటిమెంట్, ఎమోషన్స్ చాలా అద్భుతంగా చూపించారు.. దీంతో అన్ని భాషల్లో బాగా కనెక్ట్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది.
కాంతార మూవీ డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం హిట్ పై రిషబ్ శెట్టి పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలతో ఊదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన నేనే గొప్ప అనే భావన కలిగి ఉండటం మంచి పద్దతి కాదు, ఇంత పొగరు? అవసరమా అంటూ నార్త్ ఇండియన్స్ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
కాంతార మూవీ హిందీలో రిలీజై మంచి విజయం అందుకుంది కదా.. మరి హిందీలో ఏదైనా సినిమా డైరెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఒక కన్నడ వాడిగా ఎంతో గర్వపడుతున్నాను.. హిందీ మూవీస్ కి పనిచేయను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కన్నడ ఇండస్ట్రీ నాకు ఎంతో దోహదపడింది.. ఒక్క మూవీ హిట్ అయినంత మాత్రాన నా కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను మార్చలేను కదా? నా జీవితం కన్నడ సినిమాలతోనే సాగుతుంది.. ఇక్కడే నా మూలాలు’ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
హీరో రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలపై నార్త్ ఇండియన్ జనాలు భగ్గుమంటున్నారు. ఒక్క మూవీ హిట్ కాగానే తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడని.. అంతగా కన్నడ మూవీస్ పై మక్కువ ఉంటే.. మరి హిందీలో ఎందుకు డబ్ చేసి రిలీజ్ చేశారు? అంటే డబ్బు ముఖ్యం కానీ ఇండస్ట్రీని గౌరవించడం కాదా? అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. కొంత మంది అయితే కాంతార మూవీ చూడొద్దు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే రిషబ్ షెట్టి సక్సెస్ తర్వాత ఈ కామెంట్స్ చేశారు.. ఒకవేళ ముందే చేసి ఉంటే బాలీవుడ్ లో తప్పకుండా కాంతార బైకాట్ అని ట్యాగ్ పెట్టి టాం టాం చేసేవారని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.