నేచురల్ స్టార్ నాని ప్రమాదంలో చిక్కుకున్నారని, అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుంది. దీని కోసం భారీ విలేజ్ సెట్ వేసి సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ గోదావరి ఖనిలో జరిగింది. అయితే బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా.. ఆయన మీద బొగ్గంతా పడ్డట్లు సమాచారం. చిత్ర యూనిట్ వెంటనే స్పందించి నానిని కాపాడారు. అదృష్టవశాత్తు నానికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో కొద్ది సేపు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. కుదుటపడ్డాక నాని ఓకే చెప్పడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించారు.
ఇక ఈ సినిమా కోసం నాని 7 కేజీల బరువు తగ్గినట్లు సమాచారం. ఈ మూవీలో నాని ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చింపిరి జుట్టు, గుబురు గడ్డంతో రగ్డ్ లుక్‌తో అదరగొడుతున్నారు. మూవీ నేపథ్యం చూస్తుంటే కేజీఎఫ్ సినిమాని గుర్తు చేస్తోంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనిపిస్తుంది. ఈ మూవీలో నానిక జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. రిస్క్ చేసి మరీ సినిమా కోసం కష్టపడుతున్న నేచురల్ స్టార్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.